భానుకుమార్ రెడ్డి హీరోగా ఫణికుమార్ అద్దేపల్లి దర్శకత్వంలో శ్రీకారం చుట్టుకున్న సమృద్ధి సినిమాస్
సమృద్ధి సినిమాస్ పతాకంపై బేబీ సమృద్ధి సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది భాను కుమార్ రెడ్డి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సిమ్రాన్ కౌర్ హీరోయిన్. కో ప్రొడ్యూసర్ బి కే రెడ్డి. ఫణికుమార్ అద్దేపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: సురేష్ మోహన్ కృష్ణ. టెక్నికల్ హెడ్: నందిని, లైన్ ప్రొడ్యూసర్: జస్వంత్, సంగీతం పీకే. పీఆర్వో: అప్పాజీ. క్రైమ్ క్రైమ్ పిల్లర్ జోనర్ లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ తో ఈ చిత్రాన్ని సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయనున్నామని నిర్మాత తెలిపారు. గిద్దలూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దిగువమెట్ట పరిసరాలలో షూటింగ్ జరుపుకోనుంది.

