HomeEntertainmentస్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా "తక్షక" సినిమా పోస్టర్ లాంఛ్

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతుల మీదుగా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్

- Advertisment -

మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా “తక్షక”. ఈ చిత్రంలో కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై డా. లతా రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న “తక్షక” సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతోంది. తాజాగా ఈ చిత్ర పోస్టర్ ను స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ వి.వి.వినాయక్ మాట్లాడుతూ – మల్లిడి సత్యనారాయణరెడ్డి గారి కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. వారి కుటుంబం నుంచి దర్శకుడిగా మారుతున్నారు కృష్ణ మల్లిడి. చిన్నప్పటి నుంచి నాకు ఎంతో తెలిసిన కుర్రాడు కృష్ణ. ఫస్ట్ టైమ్ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. కృష్ణ మల్లిడికి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాత డా.లతారాజు గారికి థ్యాంక్స్ చెబుతున్నాను. లతా రాజు గారి అబ్బాయి కుశాల్ రాజు ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ అబ్బాయి హీరోగా నటిస్తున్న సినిమా కాబట్టి నిర్మాతగా లతా గారు కొత్త అయినా అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. ఈ సినిమా విజయం సాధించి కుశాల్ రాజు హీరోగా పేరు తెచ్చుకోవాలి, అలాగే మా కృష్ణ పెద్ద దర్శకుడు కావాలని కోరుకుంటున్నా. ఈ మూవీ చాలా బాగుండాలి, ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి. అన్నారు.

ప్రొడ్యూసర్ డా. లతారాజు మాట్లాడుతూ – మా “తక్షక” సినిమా పోస్టర్ లాంఛ్ చేసిన వినాయక్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఆయన పేరులోనే విజయం ఉంది. సరికొత్త సైన్స్ ఫిక్షన్, మైథాలజీ అంశాలున్న చిత్రమిది. మహాభారత కాలం నుంచి నేటి వరకు వేల ఏళ్లుగా జరిగిన అద్భుతమైన సన్నివేశాలతో మా సినిమాలో ఉంటాయి. ప్రతి విషయంలో కేర్ తీసుకుంటూ, రీసెర్చ్ చేస్తూ ప్రేక్షకులందరినీ ఆకట్టుకునేలా చిత్రాన్ని రూపొందించారు మా డైరెక్టర్ కృష్ణ మల్లిడి. అలాగే మా చిత్రానికి ఫిల్లర్ లా నిలబడిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాబీకి కృతజ్ఞతలు చెబుతున్నా. నాకు మోరల్ సపోర్ట్ గా మా అన్నయ్య డా.నరేంద్రనాథ్ రాజుకు థ్యాంక్స్. మా అబ్బాయి కుశాల్ రాజు గురించి చెప్పాలంటే సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. ప్రతి విషయం నేర్చుకుంటూ నటించాడు. మీ సపోర్ట్ మా మూవీకి ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.

డైరెక్టర్ కృష్ణ మల్లిడి మాట్లాడుతూ – మా “తక్షక” మూవీ ఓపెనింగ్ వినాయక్ గారి చేతుల మీదుగానే జరిగింది. ఇప్పుడు పోస్టర్ లాంఛ్ కూడా ఆయనే చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇంత త్వరగా కంప్లీట్ అయి డైరెక్టర్ గా నేను మీ ముందుకు రావడం ఎగ్జైటింగ్ గా ఉంది. సీజీ వర్క్ కంప్లీట్ చేసి ఒక గొప్ప మూవీని మీకు అందించబోతున్నాం. సినిమా సక్సెస్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాం. అన్నారు.

హీరో కుశాల్ రాజు మాట్లాడుతూ – మా మూవీ ప్రతి ఈవెంట్ లో సపోర్ట్ చేస్తున్న డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్. వినాయక్ గారు మా మూవీ పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. త్వరలోనే మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తాం. ఈ చిత్రం కోసం నేను, మా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేశాం. మా డైరెక్టర్ విజన్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నా. మీరంతా మా సినిమాను ఇష్టపడతారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – కుశాల్ రాజు(హీరో), పృథ్వీరాజ్, వైవా హర్ష, బబ్లూ

టెక్నికల్ టీమ్

నిర్మాణ సంస్థ: ఎంఎస్ఆర్ క్రియేషన్స్
నిర్మాత: డా. లతారాజు
దర్శకుడు: మల్లిడి కృష్ణ
సంగీత దర్శకుడు: శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రాఫర్: అమర్నాథ్ బొమ్మిరెడ్డి
ఫైట్ మాస్టర్: జీవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబీ రెడ్డి
పీఆర్వో: సతీష్ కొత్తంగి

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments