HomeEntertainmentకార్మికులకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మరో వరం, ఫిలిం ఫెడరేషన్ కు భవనం నిర్మించి...

కార్మికులకు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మరో వరం, ఫిలిం ఫెడరేషన్ కు భవనం నిర్మించి ఇస్తానని హామీ

- Advertisment -

సినీ కార్మికులకు అండగా నిలబడటంలో ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ నిర్మాత, దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు. చిత్రపురి కాలనీకి కోట్లాది రూపాయల రుణం ఇచ్చి ఆ కాలనీ బ్యాంక్ ఆక్షన్ కు వెళ్లకుండా కాపాడారు చదలవాడ శ్రీనివాసరావు. వందలాది సినీ కార్మికుల కుటుంబాల సొంతింటి కలను బతికించారు. ఇప్పుడు సినీ కార్మికులకు మరో వరాన్ని ఇచ్చారు చదలవాడ శ్రీనివాసరావు. ఫిలిం ఫెడరేషన్ కు సొంత భవనం నిర్మించి ఇస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆయన హామీ పట్ల ఫెడరేషన్ సభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చదలవాడ దాతృత్వం, గొప్ప సేవా గుణాన్ని ప్రశంసించారు.

ఏపి ఫిలిం డెవలప్ కార్పొరేషన్ లో బోర్డు ఆఫ్‌ డైరెక్టర్‌ గా నియమితులైన చదలవాడ శ్రీనివాసరావును ఫిలిం ఎంప్లాయిస్‌ ఫెడరేషన్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు తమకు శాశ్వత భవనం లేదనే విషయాన్ని శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సినీ కార్మికులను ఒకే తాటి మీదికి తీసుకుని వచ్చి వారికి ఉపాధి కలిగే విధానాన్ని విధానాన్నిప్రవేశ పెట్టేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫెడరేషన్ నాయకుల విజ్ఞప్తికి స్పందించిన చదలవాడ శ్రీనివాసరావు ప్రభుత్వం నుంచి స్థలం సేకరించుకోమని, ఆ స్థలంలో అన్ని సౌకర్యాలతో దేశంలో మరే సినీ ఫెడరేషన్ కు లేనంత మంచి భవనం నిర్మించి ఇస్తానని, ఈ భవనం కోసం ఎవరినీ రూపాయి విరాళం అడగవద్దని సూచించారు. మహానటుడు ఎన్టీఆర్ పేరు మీద ఈ భవనం నిర్మించి ఇస్తానని చదలవాడ అన్నారు.

ఈ సందర్బంగా చదలవాడ శ్రీనివాసరావు సినిమా పరిశ్రమ బాగుండాలంటే కొన్ని సూత్రాలను పాటించాలని సూచించారు

  1. అన్ని సినిమాలు పర్సెంటేజ్ విధానంలో ఆడాలి
  2. ప్రతి నిర్మాతకు హీరో డేట్లు తప్పని సరిగా యాభై నుండి అరవై రోజులు ఇవ్వాలి
    3 హీరోకు పారితోషికం సినిమా నిర్మాణ సమయంలో కొంత ఇచ్చి సినిమా విడుదలైన తరువాత
    మిగిలిన డబ్బులు చెల్లించే విధానాన్ని నిర్మాతల మండలి, నిర్మాతల సెక్టార్‌ పరస్పర అవగాహన కలిగి పాటించాలి.
  3. మన పూర్వ పద్దతిలో ఫైనాన్షియర్ బ్రతికే విధి విధానాలు పాటించాలి. ఫైనాన్షియర్ బ్రతికితే సినిమా కూడా బ్రతుకుతుంది.
  4. డైరెక్టర్స్ నిర్మాత, దర్శకుడు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని కాస్ట్‌ ఆఫ్‌ ప్రొడక్షన్‌ ఎలా తగ్గే
    విధివిధానాలు పాటించాలి.
  5. కాస్ట్‌ ఆఫ్ ప్రొడక్షన్ బాగా తగ్గించుకుంటూ సీనియర్‌ స్టాండర్డ్‌ నిర్మాతలను నిలబెట్టుకోవాలి.
  6. ఫెడరేషన్‌ నిర్మాతకు ఏ ఇబ్బంది కలగకుండా తగినంత సహకారాన్ని అందించాలి.
  7. నిర్మాత బాగుంటేనే ఎక్కువ సినిమాలు తీయగలుగుతారు. తద్వారా సినిమా కార్మికులకు చేతినిండా పని దొరికి వారి కుటుంబాలు ఆనందంగా ఉంటాయి.
    9.షూటింగ్‌ సమయంలో డబ్బలు వృథా చేయకుండా లో కార్వాన్ విధానాన్ని సాధ్యమైనంతగా తగ్గించి నిర్మాతకు భారం తగ్గించాలి.
    ఈ విధివిధానాలు పాటిస్తే అంపశయ్య మీద ఉన్న తెగులు సినిమా పరిశ్రమకు ఊపిరి ఆడే అవకాశం ఉంటుందని చదలవాడ శ్రీనివాసరావు సూచించారు

ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ మాట్లాడుతూ సినిమా కార్మికులకోసం ఎంతో గొప్ప సహాయ సహకారాలు ఇస్తున్న చదలవాడ శ్రీనివాసరావు గారికి తెలుగు కార్మికులంతా రుణపడి ఉంటారని అన్నారు.

ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ చదలవాడ శ్రీనివాసరావు లాంటి మనసున్న గొప్ప వ్యక్తి తెలుగు సినిమా పరిశ్రమలో ఉండటం తెలుగు సినిమా పరిశ్రమ చేసుకున్న అదృష్టమని అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌, మాతృదేవోభవ దర్శకుడు కె. అజయ్‌ కుమార్‌, డైరెక్టర్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, దర్శకుడు రామ్‌ ప్రసాద్‌, సముద్రలతో పాటు డిఓపి యూనియన్ నుండి భీముడు, ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ యూనియన్ డి. వెంకటకృష్ణ , పి.ప్రసాద్‌ బాబు, లైట్‌ మ్యాన్‌ యూనియన్, కె. శ్రీనివాస్‌, ఈశ్వర రెడ్డి , జూనియర్‌ ఆర్టిస్టు యూనియన్‌ స్వామి గౌడ్‌ ,రవీందర్‌, రవి, ప్రొడక్షన్‌ మహిళా వర్కర్స్ యూనియన్‌ లలిత, రైటర్స్ అసోసియేషన్‌ ఉమర్జీ కుమరన్‌ చిత్రపురి కాలనీ యూనియన్ జనరల్‌ సెక్రటరి ..పి.యస్.యన్‌. దొర, అలహరి, రమేష్‌ మరికొందరు ముఖ్య సభ్యులు పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments