HomeEntertainment‘రాక్షసపురం’ సినిమా ప్రేక్షకాదరణతో విజయం సాధించడం సంతోషంగా ఉంది - చిత్ర సమర్పకులు : కె.ఎస్.రామారావు

‘రాక్షసపురం’ సినిమా ప్రేక్షకాదరణతో విజయం సాధించడం సంతోషంగా ఉంది – చిత్ర సమర్పకులు : కె.ఎస్.రామారావు

- Advertisment -

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు తెలుగు ప్రేక్షకులకు అందించిన లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన ‘రాక్షసపుర’ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ రోజు (మే 15న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు వచ్చిన ‘రాక్షసపురం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డైరెక్టర్ రవి సారంగ మాట్లాడుతూ – ఫిబ్రవరిలో మేము కన్నడలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశాం. నెల రోజుల తర్వాత కేఎస్ రామారావు గారు మా మూవీ చూశారు. ఇప్పుడు రిలీజ్ చేశారు. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన చిత్రాన్ని ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకురావాలంటే ధైర్యం కావాలి. అలాంటి ధైర్యమున్న ప్రొడ్యూసర్ రామారావు గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా ప్రొడ్యూసర్ రవి వర్మ ఈ చిత్రాన్ని ఎంతో ప్యాషనేట్ గా నిర్మించారు. కథ ఓకే అయ్యాక, ఆ కథకు కావాల్సిన ప్రతీది సమకూర్చారు. హీరో రాజ్ బి శెట్టి తన పూర్తి సహకారం అందిస్తూ నన్ను ఎంకరేజ్ చేశారు. వీరందరి సహకారంతో ఈ చిత్రాన్ని సక్సెస్ ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మా మూవీని ఆదరిస్తున్న తెలుగు ఆడియెన్స్ కు కృతజ్ఞతలు. అన్నారు.

నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ – కె.ఎస్.రామారావు గారు అంటే నాకు గాడ్ ఫాదర్ లాంటివారు. ఆయన చేసిన చిత్రాలెన్నో ప్రేక్షకుడిగా చూసి ఆనందించాను. ఈ రోజు ఆయనతో కలిసి వర్క్ చేసే అవకాశం రావడం గర్వంగా ఉంది. ఈ సినిమాను 147 థియేటర్స్ లో రిలీజ్ చేశాం. మార్నింగ్ షోస్ కంటే మ్యాట్నీ షోస్ కు కలెక్షన్స్ పెరిగాయి. ఇంకా మౌత్ టాక్ తో మరింతగా కలెక్షన్స్ వస్తాయని ఆశిస్తున్నాం. ఈ చిత్రాన్ని దర్శకుడు రవి సారంగ ఆకట్టుకునేలా రూపొందించాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మన ఊహకు అందకుండా సినిమా సాగుతుంటుంది. టీజర్, ట్రైలర్ తో మా మూవీ ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి చేస్తున్న ప్రచారం, భారతీబాబు తెలుగు స్క్రిప్ట్, కేఎస్ రామారావు గారి పేరుకున్న ఇమేజ్ ఇవే మా సినిమా సక్సెస్ కు కారణం. అన్నారు.

​నటీనటులు: రాజ్ బి శెట్టి తదితరులు

టెక్నికల్ టీమ్

దర్శకత్వం: డాక్టర్ రవి
నిర్మాత: కేఎస్ రామారావు
బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments