ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్ రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరో. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
దర్శక నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ
“యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో సెన్సార్ వారు ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. దీక్ష, పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించగలమనే కాన్సెప్ట్‌తో హీరో పాత్రను తీర్చిదిద్దాం. హీరో కిరణ్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఆయన భీముని పాత్రలో చెప్పిన వన్ మినిట్ నాన్ స్టాప్ డైలాగ్ హైలైట్ అవుతుంది.
అక్స ఖాన్ ఈ చిత్రంలో డ్యాన్సర్ పాత్రలో కనిపిస్తుంది. ఆమెపై తెరకెక్కించిన ‘నంది నంది’ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రోహిత్ శర్మ నెగిటివ్ రోల్లో నటించారు. అలేఖ్య రెడ్డి, అక్స ఖాన్ కాంబినేషన్లో తులసి మంచి పాత్ర చేశారు. సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ అద్భుతమైన పాటలు అందించారు. మన వీర జవాన్ల గొప్పతనాన్ని తెలియజేసే పాటను మధుప్రియ ఆలపించారు. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం. మంచి కథను నమ్మి ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాం. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమా తర్వాత మహిళా కబడ్డీ నేపథ్యంలో మరో చిత్రాన్ని ప్రారంభిస్తాం” అన్నారు.
