- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి కుమారుడు బండి భగీరథ్‌పై ఇటీవల నమోదైన పోక్సో కేసు నన్ను తీవ్రంగా కలచివేసింది.
- పరిస్థితులు ఎలా ఉన్నా.. ప్రతి మైనర్ బాలికకు కచ్చితంగా న్యాయం జరగాలనే ఉద్దేశ్యంతోనే #POCSO చట్టాన్ని తీసుకువచ్చారని నేను బలంగా నమ్ముతున్నాను.
- అధికారం, పదవి, పలుకుబడి లేదా హోదా ఎప్పుడూ న్యాయానికి అడ్డు రాకూడదు. రాజ్యాంగం, చట్టం దృష్టిలో ప్రతి బాలికకు సమానమైన న్యాయం దక్కాల్సిందే.
- మైనర్లకు సంబంధించిన కేసుల్లో వేగంగా స్పందించాలి, అలాగే పారదర్శకత, జవాబుదారీతనం చాలా అవసరం. విచారణలో జాప్యం జరిగినా, మౌనం వహించినా లేదా పక్షపాత చర్యలు తీసుకున్నా.. అది న్యాయవ్యవస్థపై ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.
- ఇది రాజకీయాలకు లేదా వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు. కేవలం నిజం బయటకు రావాలి, న్యాయం గెలవాలి.
- ఎలాంటి ఒత్తిళ్లు, ప్రభావాలకు తావులేకుండా ఈ కేసు దర్యాప్తు, చట్టపరమైన ప్రక్రియలన్నీ అత్యంత వేగంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
- న్యాయం జరగడమే కాదు, అది జరిగినట్లు అందరికీ స్పష్టంగా కనిపించాలి. చట్టం ముందు అందరూ సమానులే అని ఈ కేసు ద్వారా మరోసారి నిరూపితం కావాలి. #Justice


