Friday, December 5, 2025
HomeEntertainmentమన శంకర్ వర ప్రసాద్ గారు మనసు పారేసుకున్నారు

మన శంకర్ వర ప్రసాద్ గారు మనసు పారేసుకున్నారు

- Advertisment -

మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.
నేటి నుంచి మెగాస్టార్ చిరంజీవి, నయనతారలపై ఓ మంచి రొమాంటిక్ సాంగ్ హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమా కోసం అద్భుతమైన ఆల్బమ్‌ను రూపొందించారు. ఈ పాటను డ్యాన్స్ మాస్టర్ విజయ్ పోలంకి కొరియోగ్రఫీ చేస్తారు.
ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, తమ్మిరాజు ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సహ రచయితలుగా ఉన్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.
మన శంకర వర ప్రసాద్ గారు 2026 సంక్రాంతి పండుగకు వస్తున్నారు!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments