HomeEntertainmentచిరంజీవి కొణిదెలతో బాబి కొల్లి చిత్రం ఒక కొలిక్కి

చిరంజీవి కొణిదెలతో బాబి కొల్లి చిత్రం ఒక కొలిక్కి

- Advertisment -

మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి‌తో కలిసి మెగాస్టార్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #ChiruBobby2 చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. లుక్ టెస్ట్ చూస్తుంటే మెగాస్టార్ పవర్‌ఫుల్, స్ట్రైకింగ్ లుక్ లో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఇప్పటికే విడుదలైన హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ పోస్టర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. చిరంజీవి కొత్త షేడ్‌లో కనిపించనున్నట్లు పోస్టర్ హింట్ ఇచ్చింది.

‘వాల్తేర్ వీరయ్య’ బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మాస్ ఎంటర్టైన్మెంట్‌ను తనదైన స్టైల్‌లో అద్భుతంగా అందించే బాబీ కొల్లి, ఈసారి మెగాస్టార్ కోసం మరింత ఇంటెన్స్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత ఎలివేట్ చేసేలా స్క్రిప్ట్ సిద్ధమౌతోంది. ఈ కాంబో నుంచి హై-ఆక్టేన్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ రాబోతుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు. అభిమానులు, సినీప్రేక్షకులు ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అఫీషియల్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments