HomeEntertainmentమునుపెన్నడూ జేడీని చూస్తారు

మునుపెన్నడూ జేడీని చూస్తారు

- Advertisment -

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ జేడి చక్రవర్తి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

-క్యారెక్టర్ ఆర్క్‌లో ఏదైనా చాలెంజ్ ఉంటే ఏ నటుడికైనా చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ధర్మా క్యారెక్టర్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడు ఒక విషయం చెప్పాను, మళ్లీ అదే చెబుతున్నాను. కమల్ హాసన్ గారు చేసిన క్యారెక్టర్లు ప్రపంచంలో ఎవ్వరూ చేయలేదు. అయితే ‘గాయపడ్డ సింహం’లో యాక్టర్‌గా కాదు, క్యారెక్టర్ పరంగా ఆయనకు రాని అదృష్టం నాకు వచ్చిందని భావిస్తున్నాను. అలాంటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. ఒకే క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్‌లో ఒక షేడ్, సెకండ్ హాఫ్‌లో మరో షేడ్ ఉండటం మామూలే. కానీ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ రెండింటిలో ఒకే విధంగా కనిపిస్తూ, రెండు షేడ్స్ లో కనిపించడం నన్ను చాలా ఎక్సైట్ చేసింది. అది ఎలా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అలా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను అని చెప్పడం లేదు. కథలోనే ఆ బలం, మ్యాజిక్ కుదిరింది!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments