HomeEntertainment2027 జనవరి 21న విడుదల కానున్న 'లవ్ అండ్ వార్' చిత్రం

2027 జనవరి 21న విడుదల కానున్న ‘లవ్ అండ్ వార్’ చిత్రం

- Advertisment -

భారతీయ చలనచిత్ర రంగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ ప్రేమకథ చిత్రం ‘లవ్ అండ్ వార్’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రిపబ్లిక్ డే వారాంతాన్ని పురస్కరించుకుని 2027 జనవరి 21వ తేదీన (గురువారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఎంతో ఉత్కంఠభరితంగా సాగే ఈ రొమాంటిక్ డ్రామాలో బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భన్సాలీకి మాత్రమే సాధ్యమైన అద్భుతమైన విజువల్స్, భారీ సెట్టింగ్స్, లోతైన భావోద్వేగాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

భారతీయ సినిమాలో ఇప్పటివరకు వచ్చిన అతిపెద్ద రొమాంటిక్ సినిమాలలో ఒకటిగా, భన్సాలీ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా ‘లవ్ అండ్ వార్’ నిలవబోతోంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments