- వైభవంగా”కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ*
పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “కాలగమనం”. సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తోన్న ఈ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం ఈనెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ రాజ్ తేలు మాట్లాడుతూ – “కాలగమనం” సినిమాను మా డైరెక్టర్ సుధాకర్ బుర్రి గారు బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. నేను పోస్ట్ ప్రొడక్షన్ చేసే టైమ్ లో అనేక సార్లు ఈ చిత్రాన్ని చూశాను. నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులు కూడా మా మూవీని ఇష్టపడతారని, సక్సెస్ చేస్తారని నమ్ముతున్నా. అన్నారు.

నటుడు జబర్దస్త్ రాజమౌళి మాట్లాడుతూ – “కాలగమనం” చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్ లో నటించాను. కొత్తదనంతో ఉండే ప్రేమ కథా చిత్రమిది. వినోదంతో పాటు మంచి సందేశం కూడా మూవీలో ఉంటుంది. ఈ సినిమాను ఈ నెల 17న థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలని కోరుతున్నా. అన్నారు.
అతిథిగా వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ బోలే షావలి మాట్లాడుతూ – ఎంత ప్రతిభ ఉన్నా అవకాశం ఇచ్చేవాళ్లు ముఖ్యం. సుధాకర్ బుర్రి గారు ఇలా ఎంతోమంది కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తున్నారు. ఆయన ఇంటిపేరు బుర్రి, కానీ ఆయన మర్రి లాంటి వారు. మర్రిచెట్టు కింద ఎంతోమంది తలదాచుకున్నట్లు సుధాకర్ బుర్రిగారు ఎంతోమందికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించాలి. అన్నారు.
హీరో రాజా బిరుదుల మాట్లాడుతూ – మా “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథులుగా వచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇందరు అతిథులు మా మూవీ ఈవెంట్ కు వచ్చారంటేనే ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది తెలుస్తోంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ మీట్ లో మీతో మళ్లీ మేమంతా మాట్లాడుతాం. “కాలగమనం” సినిమాలో హీరోగా నటించే అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్, డైరెక్టర్ సుధాకర్ బుర్రి గారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాం. మీడియా మిత్రులు మా మూవీకి తమ వంతు సహకారం అందించాలని కోరుతున్నా. ఒక మంచి సందేశం ఉన్న ప్రేమ కథా చిత్రమిది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. థియేటర్స్ లో మా మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

హీరోయిన్ లావణ్య రామారావు మాట్లాడుతూ – మా “కాలగమనం” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. మేమంతా కొత్త వాళ్లం. మాకు వచ్చే అవకాశాలు ఎంతో విలువైనవి. ఈ చిత్రంతో అలాంటి విలువైన అవకాశం మా డైరెక్టర్ సుధాకర్ అన్న కల్పించారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. అలాగే నా కోస్టార్ రాజా బిరుదుల చాలా సపోర్ట్ చేశారు. మా మూవీ ఈ నెల 17న థియేటర్స్ లోకి వస్తోంది. మీరంతా సపోర్ట్ చేయాలి. ఈ సినిమా సక్సెస్ మీట్ లో కలుద్దాం. అన్నారు.
దర్శక,నిర్మాత సుధాకర్ బుర్రి మాట్లాడుతూ – నేను గతంలో కొన్ని షార్ట్ ఫిలింస్ చేశాను. సినిమా మేకింగ్ మీద ప్యాషన్ పెరుగుతూ వచ్చింది. మాకున్న బడ్జెట్ లో ఒక మంచి కథను తెరకెక్కించాం. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రానికైనా పెద్ద విజయాన్ని ప్రేక్షకులు అందిస్తున్నారు. ఈ మూవీ కంటెంట్ బాగుంది, అందుకే విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. యువతను ఆకట్టుకునే అంశాలు ఉంటూనే పెద్దల్ని కూడా ఆలోచింపజేచేసే చిత్రమిది. మా మూవీ కాస్ట్ అండ్ క్రూ సినిమా కోసం కష్టపడి పనిచేశారు. కొన్నిసార్లు ఎలాంటి సౌకర్యాలు లేకున్నా సినిమా మీద ప్యాషన్ తో వర్క్ చేశారు. మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. ఈ నెల 17న మా “కాలగమనం” మూవీని థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్రంలో నటించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
నటీనటులు – రాజా బిరుదుల, లావణ్య రామారావు, చిన్న బాబు కల్లా, డాక్టర్ జబర్దస్త్ రాజమౌళి, అన్నె శిరీష, సతీష్ సరిపల్లి, ఆర్కే నాయుడు, బలగం రమేష్, బలగం కర్తానందం, జబర్దస్త్ శాంతి కుమార్, శివ ప్రసాద్, తిరు నాచురల్ , చిన్నారావు దొడ్ల, సీతారాం, తదితరులు
టెక్నికల్ టీమ్
మ్యూజిక్- రాజేష్ రాజ్ తేలు,
డి ఓ పి- మురళి కంకణాల,
ఎడిటర్- శ్రీకృష్ణ ప్రసాద్,
అసిస్టెంట్ డైరెక్టర్- శ్రీనివాస్ కారేటి
కాస్ట్యూమ్ డిజైనింగ్- శ్వేతా బొమ్మారెడ్డి
పీఆర్ఓ – బి. వీరబాబు
నిర్వహణ- పిల్లెం రామారావు , శ్రీకర్ బుర్రి
స్క్రిప్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ – సుధాకర్ బుర్రి
