దేవరకొండకు అండగా
కరెక్ట్ గా అది ఏ సందర్భమో తెలియదు కానీ… విజయ్ దేవరకొండతో రష్మిక ఇలా అంటుంది ఓ వీడియోలో…. “నేను చాలారోజుల వరకు నీతో సినిమాలు చేయను… అప్పుడు నీకు తెలిసొస్తుంది”. నిజంగానే “గీత గోవిందం” తర్వాత దేవరకొండకు విజయమన్నది లేదు. ఆ మాటకొస్తే… వీరిద్దరూ జంటగా నటించిన “డియర్ కామ్రేడ్” కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే… “పుష్ప, యానిమల్, చావా” చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగిపోయి, తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న మందన్నా… తన “డియర్ కామ్రేడ్” కోసం రంగంలోకి దిగింది. దేవరకొండ చిత్రానికి క్రేజ్ తీసుకురావడం కోసం…

రౌడీ స్టార్ తాజా చిత్రం కోసం కాల్షీట్స్ కేటాయించింది. విజయ్ తో ఇంతకుముందు “ట్యాక్సీవాలా” తీసి ఓ మోస్తరు విజయం అందుకున్న రాహుల్ సంకృత్యయన్ దర్శకత్వంలో విజయ్ నటించే ఇంకా పేరు పెట్టని చిత్రంలో ఏరికోరి నటిస్తోంది క్రష్మిక. ఈ కాంబినేషన్ కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ కి చాలా పెద్ద హెల్ప్ కానుంది. పైగా రష్మిక ఒక సినిమాకు ఆషామాషీగా సైన్ చేసేయదు. ఆమెకు గల సక్సెస్ రేట్ ఇందుకు నిదర్శనం. “ఛలో, భీష్మ” చిత్రాల తర్వాత వెంకీ కుడుములతో “రాబిన్ హుడ్”లోనూ నటించేందుకు అంగీకరించి, డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదంటూ ఆనక ఆమె ఆ చిత్రాన్ని వదులుకోవడాన్ని కొంచెం లోతుగా పరిశీలించినప్పుడు, పై వాదనకు బలం చేకూరుతుంది. ఏది ఏమైనా విజయ్ దేవరకొండతో రష్మిక ముచ్చటగా మూడోసారి జత కట్టడం ఈ చిత్రానికి కచ్చితంగా ప్రత్యేక ఆకర్షణ కానుంది!!

