శీలావతి అనుష్క శెట్టి
క్వీన్ అనుష్క శెట్టి యాక్షన్ డ్రామా “ఘాటి”. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో క్వీన్ అనుష్క శెట్టి సినిమా విశేషాలు పంచుకున్నారు.
“ఘాటీ”లో చేసిన శీలావతి అమేజింగ్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ నేను గతంలో ఎప్పుడూ చేయలేదు. చాలా బ్యూటిఫుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. కంఫర్ట్ జోన్ ని దాటి చేసిన సినిమా ఇది.
“అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి, భాగమతి” ఈ సినిమాలన్నిటిలోనూ చాలా బలమైన పాత్రలు చేశాను. ఘాటిలో చేసిన శీలావతి క్యారెక్టర్ కూడా అంత బలంగా ఉంటూనే ఒక డిఫరెంట్ షేడ్ తో ఉంటుంది.
-ప్రతి విమెన్ సింపుల్ గా సున్నితంగా కనిపించినా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక బలమైన పిల్లర్ లాగా నిలబడతారు. విమెన్ లో ఉండే గొప్ప క్వాలిటీ అది. క్రిష్ గారు అలాంటి ఒక బలమైన పాత్రని తీర్చిదిద్దారు.
-క్రిష్ గారు, రచయిత శ్రీనివాస్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఆ కల్చర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. లొకేషన్స్ కి వెళ్ళిన తర్వాత ఒక కొత్త క్యారెక్టర్, కల్చర్, ఒక కొత్త విజువల్ ని ఆడియన్స్ కి చూపించబోతున్నామనే ఎక్సైట్మెంట్ కలిగింది!!

