ప్రతిష్టాత్మకమైన “గామా” (గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్) అవార్డుల కార్యక్రమం తాజాగా దుబాయ్‌లోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ అవార్డుల కార్యక్రమంలో ‘శివం భజే’ డైరెక్టర్ అప్సర్ సందడి చేశారు. ఆయన తెరకెక్కించిన ‘శివం భజే’ మూవీకి మోస్ట్ అస్పైరింగ్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నారు. ‘గంధర్వ’తో దర్శకుడిగా డిఫరెంట్ ప్రాజెక్ట్‌తో అప్సర్ అందరినీ మెప్పించారు. ఇక అశ్విన్ బాబు హీరోగా వచ్చిన ‘శివం భజే’ మూవీని మరో డిఫరెంట్ టేకింగ్, మేకింగ్‌తో తెరకెక్కించారు. ‘శివం భజే’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు అప్సర్!!

