రన్ రాజా రన్ – ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు – బైకర్
చార్మింగ్ స్టార్ శర్వా లేటెస్ట్ బంపర్ బ్లాక్ బస్టర్ బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్ర పోషించారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యు వి క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటో క్రాస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ప్రిమియర్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రేక్షకులు, విమర్శకులు నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బంపర్ బ్లాక్ బస్టర్ మీట్ ని నిర్వహించారు. చార్మింగ్ స్టార్ శర్వా మాట్లాడుతూ.. “ముందుగా ప్రభాస్ అన్నకి థాంక్స్ చెప్పాలి. మా ట్రైలర్ రిలీజ్ కి ట్వీట్ వేశారు. అలాగే సినిమా రిలీజ్‌కు ముందు ఒక చిన్న యాడ్ చేసి సపోర్ట్ ఇచ్చారు. లవ్ యూ ప్రభాస్ అన్న. నా మనసులో ఆయన ఎప్పుడూ గొప్ప స్థానంలో ఉంటారు. ఈ సినిమాకు ఫస్ట్ హీరో మా ప్రొడ్యూసర్ వంశీ అన్న. ఈ కథను మొదట నాకు పంపించింది ఆయనే. యూవీ క్రియేషన్స్‌లో ఇది నాకు నాలుగో హిట్. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు, ఇప్పుడు బైకర్. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ ఇస్తానని చెప్పాను.. ఇచ్చాను. ఇప్పుడు సమ్మర్‌కు బంపర్ బ్లాక్‌బస్టర్ ఇచ్చాం. ఈ విజయాన్ని నాకు అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అన్నారు!!

