HomeNewsఎఫ్ఎన్ సిసి -పుల్లెల గోపీచంద్ బ్యాడ్మిండన్ లీగ్

ఎఫ్ఎన్ సిసి -పుల్లెల గోపీచంద్ బ్యాడ్మిండన్ లీగ్

- Advertisment -

ఫిలింనగర్ కల్చరల్ సెంటర్, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం ఎఫ్ఎన్ సిసిలో సందడిగా జరిగింది. ఈ నెల 4, 5 తేదీలలో ప్రారంభమయ్యే ఈ లీగ్ వచ్చే నాలుగైదు వారాలు వీకెండ్స్ లో శని, ఆదివారాలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా టాప్ 10 మెన్ అండ్ వుమెన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ ఈ లీగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ అనౌన్స్ మెంట్ కార్యక్రమంలో ఎఫ్ఎన్ సిసి ప్రెసిడెంట్ కె.ఎస్. రామారావు మాట్లాడుతూ – తెలంగాణ బ్యాట్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్, ఎఫ్ఎన్ సిసి బ్యాడ్మింటన్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం చొరవతో ఎఫ్ఎన్ సిసి – పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ ప్రారంభిస్తున్నాం” అన్నారు.


ఎఫ్ఎన్ సిసి బ్యాడ్మింటన్ కమిటీ ఛైర్మన్ పురుషోత్తం, తెలంగాణ బ్యాట్మింటన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్, ఫిలింనగర్ సొసైటీ సెక్రటరీ, ఎఫ్ఎన్ సిసి కమిటీ మెంబర్ కాజా సూర్యనారాయణ, ఎఫ్ఎన్ సిసి సెక్రటరీ తుమ్మల రంగారావు, ఎఫ్ఎన్ సిసి వైస్ ప్రెసిడెంట్ ఎస్ ఎన్ రెడ్డి, ట్రెజరర్ శైలజ జూజాల, ఎఫ్ఎన్ సిసి కమిటీ మెంబర్స్ వేణు, ఏడిద రాజా, కమిటీ మెంబర్ మరియు స్పోర్ట్స్ కమిటీ కన్వీనర్ కోగంటి భవానీ, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments