HomeEntertainmentహీరోయిన్ ఈషా రెబ్బ చేతుల మీదుగా గాజువాక టౌన్‌లో ‘కలర్స్ 2.0’ ప్రారంభం

హీరోయిన్ ఈషా రెబ్బ చేతుల మీదుగా గాజువాక టౌన్‌లో ‘కలర్స్ 2.0’ ప్రారంభం

- Advertisment -

▪️ 54వ బ్రాంచీ లాంచ్ చేసిన ‘కలర్స్ హెల్త్‌కేర్’
▪️ అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుక
▪️ అత్యుత్తమ టెక్నాలజీతో ‘కలర్స్ 2.0’ వెల్నెస్ సేవలు

గాజువాక: ఆరోగ్యంతోనే అందం ముడిపడి ఉందని, అందుకోసం యువత ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హీరోయిన్ ఈషా రెబ్బ అన్నారు. ప్రముఖ వెల్నెస్, హెల్త్‌కేర్ సంస్థ ‘కలర్స్ ఏర్పాటుచేసిన నూతన బ్రాంచ్ ‘కలర్స్ 2.0’ను గాజువాకలో ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతంలో తాను రెండు సినిమాల్లో న‌టిస్తున్న‌ట్టు చెప్పారు. పోషకాహారంతోనే మెరుగైన ఆరోగ్యం అందం సిద్ధిస్తుందన్నారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆధునిక జీవనశైలిలో ఆరోగ్యం, అందంపై శ్రద్ధ అత్యంత అవసరమని పేర్కొన్నారు. బరువు తగ్గడం, జుట్టు, చర్మ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. కలర్స్ సంస్థ సేవలు ఇప్పటికే అనేక మందిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయని తెలిపారు.

కలర్స్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, గాజువాకలో బ్రాంచ్ ప్రారంభించడం తమకు ఆనందంగా ఉందన్నారు. తాను ఇక్కడే గాజువాకలో టీఎస్ఆర్ టీబీకే కళాశాలలో చదువుకున్నానని, గాజువాక వాసులకు ఎప్పుడు తన ప్రాధాన్యత సేవలు అందుతాయి అని చెప్పారు. అందరికీ ఉపయోగపడేలా బరువు తగ్గుదల గురించి తాము సేవలు అందించడం ఎంతో సంతోషం అన్నారు. పదిమందికి ఉపయోగపడేది అందరికీ ప్రయోజనకారిగా ఉండే విధంగా తమ సేవలు కొనసాగుతాయ‌ని చెప్పారు. శారీరకంగా ఒక బరువు తగ్గడం అనేది, 90 రకాల కు పైగా ఇబ్బందులు తగ్గిస్తుందన్నారు. తమ కలర్స్ లో 250 మందికి పైగా న్యూట్రిసినిస్ట్, 100 మందికి పైగా నిపుణులైన వైద్యులు , 2000 మంది సుశిక్షితులైన టెక్నీషియన్స్ ఉన్నారని, 22 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో పనిచేస్తున్నట్టు చెప్పారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్‌డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలను అందిస్తున్నామని వివరించారు.

మేనేజింగ్ డైరెక్టర్ డా. విజయ్ కృష్ణ మాట్లాడుతూ, గాజువాక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవంతో నమ్మకాన్ని సంపాదించిన కలర్స్, ఇప్పుడు మరింత ఆధునిక సేవలను అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. ఆరోగ్యంగా, అందంగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరికీ తమ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఆపరేషన్స్ డైరెక్టర్ కృష్ణంరాజు మాట్లాడుతూ, కలర్స్‌ను ఉత్తమ వెల్నెస్ క్లినిక్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. బరువు తగ్గడం, ఆరోగ్య సంరక్షణ, అందం పరిరక్షణలో ప్రత్యేక సేవలను అందిస్తున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 51 మంది డెర్మటాలజిస్టులతో సేవలు అందిస్తున్న ఏకైక వెల్నెస్ సంస్థగా కలర్స్ ప్రత్యేకత సాధించిందని అన్నారు.

5ఎం మీడియా ఆధ్వర్యంలో జైదీప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక యువత పాల్గొన్నారు.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments