HomeEntertainmentఇలాంటి సినిమా చూసి చాలా కాలమైందని 'ఉస్తాద్ భగత్ సింగ్' చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటారు:...

ఇలాంటి సినిమా చూసి చాలా కాలమైందని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటారు: ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్

- Advertisment -

ఈ ఉగాదికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూపంలో ఒక మంచి తెలుగు సినిమా వస్తుంది: కథానాయిక శ్రీలీల

‘గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వరకర్తగా కాగా, ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. అంచనాలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, మాస్ సినిమాకు కొత్త నిర్వచనం ఇవ్వడానికి ఉగాది కానుగా మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం చిత్ర బృందం, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది.

ఈ సందర్భంగా కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ముందుగా మీడియా మిత్రులకు కృతఙ్ఞతలు. చాలా రోజుల తరువాత మిమ్మల్ని ఇలా కలవడం సంతోషంగా ఉంది. ఈ ఉగాది ‘ఉస్తాద్ ఉగాది’ కాబోతుంది. ఒక బిగ్ స్టార్ నుంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ వచ్చి చాలా కాలమైందని నా అభిప్రాయం. అభిమానులు మాత్రమే కాకుండా, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేసేలా స్టార్ హీరో నుంచి అన్ని హంగులతో వచ్చిన సినిమా ఈ మధ్య కాలంలో లేదని నా ఫీలింగ్. పాటలు, డ్యాన్స్, డైలాగులు, ప్రేమ, హాస్యం, విలన్ తో పవర్ ఫుల్ సీన్స్.. ఇలా అన్ని అంశాలు ఉంటాయి. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందని నేను చెప్పలేని కానీ, ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇలాంటి సినిమా వచ్చి కాలమైంది, ఇంత ఎంటర్‌టైనింగ్ సినిమా వచ్చి చాలా కాలమైందని అనుకుంటారు. హెయిర్ స్టైల్ నుంచి డ్యాన్స్, డైలాగ్ లు, హాస్యం వరకు ఇలా పవన్ కళ్యాణ్ గారి నుంచి కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉండి.. పూర్తిస్థాయి పవన్ కళ్యాణ్ గారి సినిమా చూశామనే సంతృప్తిని ఇస్తుంది ఉస్తాద్. అనుకున్న సమయంలో సినిమాను పూర్తి చేసి, మంచి అవుట్ పుట్ ఇచ్చాము. పక్కా ప్లానింగ్ తో సమయాన్ని, డబ్బుని వృధా చేయకుండా ఈ సినిమా పూర్తి చేయగలిగాము. అలా చేయగలగడానికి మా ప్రధాన బలం పవన్ కళ్యాణ్ గారు. ప్రజా పాలన, పరిపాలనా పరమైన అంశాలకు ఇబ్బంది కలగకుండా మాకు సమయం ఇచ్చేవాళ్ళు. ఫలానా సమయానికి రాగలనని, ఇంత సమయం కేటాయించగలనని ముందుగానే సమాచారం ఇచ్చేవారు. మైత్రి మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలను కాపాడుకోవడం నాలాంటి ప్రతి దర్శకుడి బాధ్యత. వీళ్ళు మరిన్ని సినిమాలు తీస్తూ, పది కాలాల పాటు ఇండస్ట్రీలో ఉండాలి. సినిమా ఆలస్యమైనా ఒక్కసారి కూడా అసహనం ప్రదర్శించలేదు. బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. నేను అడిగిన దానికంటే ఎక్కువే ఇచ్చారు. మా నిర్మాతల మద్దతు వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. అలాగే చివరి నిమిషంలో హీరోలా వచ్చి, నేపథ్య సంగీతం బాధ్యత తీసుకున్న తమన్ కి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఇలాంటి అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాకి కేవలం 12-13 రోజుల్లో అద్భుతమైన నేపథ్య సంగీతం అందించాడు. ఈ సినిమాకి అన్నీ కుదిరాయి. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతఙ్ఞతలు. ఇలాంటి పూర్తిస్థాయి ఎంటర్‌టైనింగ్ సినిమా చూసి కాలమైందని చూసిన ప్రతి ఒక్కరూ కనీసం పది మందికి చెబుతారు. అభిమానులు మళ్ళీ మళ్ళీ చూస్తారు.” అన్నారు.

నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ.. “చాలా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలనేది మా కల. అది ఉస్తాద్ భగత్ సింగ్ తో నెరవేరింది. ఐదారేళ్ళ క్రితం సినిమా చేయాలనుకున్నాము. కోవిడ్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం వంటి కారణాల వల్ల.. గతేడాది జూన్ లో సినిమా ప్రారంభించాము. నిర్మాతలుగా మాకు ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఒక పిక్నిక్ లాగా సినిమా అయిపోయింది. దానికి ముఖ్య కారణం మా దర్శకుడు హరీష్ శంకర్ గారు. పవన్ కళ్యాణ్ ప్రజా సేవలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ, ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేసి షూటింగ్ పూర్తి చేశారు హరీష్ గారు. ప్రతి మూవీ ఎలా ఉంటే.. సంవత్సరానికి పది మూవీలు హ్యాపీ తీయొచ్చు. సరిగా నిద్ర కూడా పోకుండా పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా చూసుకున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇప్పటికీ నాలుగైదు సార్లు చూశాను. ఎన్నిసార్లు చూసినా ఒకటే అభిప్రాయం. ఇది పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్. వినోదం, భావోద్వేగాలతో పాటు అన్ని అంశాలు నిండి.. ఆద్యంతం సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది. ఇదొక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. రేపు ఉదయం 5 గంటల నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయి. అందరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తానని ఆశిస్తున్నాము.” అన్నారు.

కథానాయిక శ్రీలీల మాట్లాడుతూ.. “ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరాది కానుకగా మా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలవుతుండటం మాకు చాలా చాలా ప్రత్యేకం. సినిమా పట్ల మేము చాలా నమ్మకంగా ఉన్నాము. ఒక మంచి తెలుగు సినిమా ఉగాదికి వస్తుంది. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ప్రేక్షకుల మా సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాము. మీడియా మద్దతు మరువలేనిది. రాశి ఖన్నా స్వీట్ హార్ట్. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు లేనప్పటికీ, ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఒకరికొకరం దగ్గరయ్యాం. ఈ సినిమా మాకు చాలా ముఖ్యమైనది. అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను.” అన్నారు.

కథానాయిక రాశి ఖన్నా మాట్లాడుతూ.. “రేపు ఉస్తాద్ భగత్ సింగ్ ప్రేక్షకుల ముందుకు వస్తుండటం చాలా ఉత్సాహంగా ఉంది. 2026 లో నా మొదటి సినిమా, ఉగాదికి వస్తుంది, పైగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది నాకు ట్రిపుల్ సెలబ్రేషన్. అందరం ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాము. ముఖ్యంగా హరీష్ శంకర్ గారు నిద్ర కూడా మానుకొని సినిమా కోసం కష్టపడ్డారు. ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు సినిమా కోసం ఎంతో చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.” అన్నారు.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా, పార్థిబన్ తదితరులు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
నేపథ్య సంగీతం: ఎస్. తమన్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments