HomeEntertainment"మిరాకిల్" నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్

“మిరాకిల్” నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్

- Advertisment -

-క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్

దర్శకుడిగా ప్రభాస్ నిమ్మల పేరు
మారుమ్రోగేలా చేసే చిత్రం మిరాకిల్

-మల్టీ టాలెంటెడ్ హీరో శ్రీరామ్

కొండమడుగు ప్రజలకు
జీవితాంతం కృతజ్ఞడునై ఉంటాను. ఇప్పటివరకు భారతీయ తెరపై ఆవిష్కారం కాని వినూత్న కథా చిత్రం “మిరాకిల్”

-దర్శకుడు ప్రభాస్ నిమ్మల

“కుమారి 21ఎఫ్, ఈడో రకం – ఆడో రకం, ఓదెల రైల్వే స్టేషన్” వంటి బ్లాక్ బస్టర్స్ నా కెరీర్ లో ఎన్నో ఉన్నప్పటికీ… తాజాగా నేను చేస్తున్న “మిరాకిల్” నా కెరీర్ లో మోస్ట్ మెమరబుల్ మూవీ అవుతుంది. థాంక్స్ టు డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల” అని అన్నారు క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్.

సైదా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఎగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న వినూత్న కథాచిత్రం “మిరాకిల్”లో హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తోంది.. సీనియర్ హీరోలు సురేష్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో రణధీర్ బీసు హీరో. “సత్య గ్యాంగ్, ఫైటర్ శివ” చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం మూడో షెడ్యూల్ హైదరాబాద్ పరిసర గ్రామమైన “కొండమడుగు”లో పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పెద్దలు, ప్రజలు, యూనిట్ సభ్యులందరి సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించింది “మిరాకిల్” చిత్రబృందం. తన కెరీర్ బెస్ట్ ఫిల్మ్ గా “మిరాకిల్” నిలిచిపోతుందని ప్రకటించడం ద్వారా ఈ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది హీరోయిన్ హెబ్బా పటేల్.

కొండమడుగు గ్రామం నడిబొడ్డున గ్రామ ప్రజలతో కిక్కిరిసిన ఈ మీడియా సమావేశంలో… హీరో శ్రీరామ్, హీరోయిన్ హెబ్బా పటేల్, దర్శకుడు ప్రభాస్ నిమ్మల, చిత్ర కథానాయకుడు రణధీర్ బీసు, ఈ చిత్రంతో ప్రతి నాయకుడిగా పరిచయమవుతున్న నరేష్ నాయుడు, సినిమాటోగ్రాఫర్ సురేందర్ రెడ్డి, సెకండ్ అండ్ థర్డ్ హీరోయిన్స్ నవ్యశ్రీ, అక్షర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్, ఈ చిత్రంలో ఫోరెన్సిక్ ఆఫీసర్ గా నటిస్తున్న సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీతోపాటు… కొండమడుగు గ్రామ పెద్దలు పాల్గొని మాట్లాడారు!!

సీనియర్ హీరో శ్రీరామ్ మాట్లాడుతూ… “మిరాకిల్” వంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద హిట్ చేస్తారని, దర్శకుడిగా ప్రభాస్ నిమ్మలకు ఉజ్వల భవిష్యత్ ఉందని పేర్కొన్నారు.
ఈ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరో రణధీర్, సెకండ్ అండ్ థర్డ్ హీరోయిన్లు నవ్యశ్రీ, అక్షర, విలన్ పాత్రధారి నరేష్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ… ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాలా భావించి, అంకితభావం చూపుతుండడం నన్ను చాలా భావోద్వేగానికి లోనుచేస్తోంది. మరీ ముఖ్యంగా శ్రీరామ్, సురేష్, హెబ్బా పటేల్ సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేను.

హీరో రణధీర్, విలన్ నరేష్ నాయుడులకు ఈ చిత్రంతో చాలా మంచి పేరు వస్తుంది. ఇప్పటివరకు మన ఇండియన్ స్క్రీన్ పై రాని సరికొత్త కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం చాలా బాగా వస్తుండడానికి ముఖ్య కారకులు మా కెమెరామెన్ సురేందర్ రెడ్డి. అలాగే కొండమడుగు గ్రామ ప్రజల ప్రేమాభిమానాలు మా యూనిట్ ఎప్పటికీ మర్చిపోదు. ఈ గ్రామంలో కచ్చితంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేస్తాం” అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… “ఈ మూడో షెడ్యూల్ తో దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలో ప్లాన్ చేస్తాం. మా దర్శకుడు ప్రభాస్ నిమ్మల ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం కచ్చితంగా ఉంటుంది” అని అన్నారు.

ఆమని, నల్లా శ్రీధర్ రెడ్డి, యోగి కాత్రే, సాయిబాబా, దిల్ రమేష్, టేస్టీ తేజ, ఝాన్సీ, హర్షిత, మాస్టర్ షన్విత్, సూర్యనారాయణ, శ్రీధర్, శ్రీకాంత్, శివ, హైమావతి, సమీర్ దత్తా, బెజవాడ మస్తాన్, ఆర్. కుమార్, బలగం రమేష్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వినయ్ కుమార్, కెమెరా: సురేందర్ రెడ్డి, ఎడిటింగ్: విశ్వనాధ్, మాటలు: జగతా శ్రీనివాస్, పాటలు: రాంబాబు గోసాల, ఫైట్స్: శ్రీను, నిర్మాతలు: రమేష్ ఎగ్గిడి – శ్రీకాంత్ మొగదాసు – చందర్ గౌడ్, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-సంగీతం-దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల.

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments