సినిమాల్లోనూ రాణించాలన్నది
తన ఆకాంక్ష అంటున్న సంజనా!!
“మిస్ ఇండియా గ్లామ్ వరల్డ్ 2026” జాతీయ స్థాయి పోటీలో మన తెలుగమ్మాయి, హైదరాబాద్‌కు చెందిన సంజనా ఆకాశం (24) రెండో రన్నరప్‌గా నిలిచి నగరానికి గర్వకారణమయ్యారు. ఈ పోటీని పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించింది.
వృత్తిరీత్యా న్యాయవాదిగా పని చేస్తున్న సంజనా, పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయని కూడా. తన ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంతో పాటు గానం ద్వారా కూడా ఆమె ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంటున్నారు. టాలెంట్ రౌండ్‌లో విజేతగా నిలిచి తన సింగింగ్ టాలెంట్ కు ప్రశంసలు అందుకున్నారు.
ఈ విజయంపై స్పందించిన సంజనా, ఆధునిక భారతీయ మహిళను ప్రాతినిధ్యం వహించే అవకాశం ఈ వేదిక ద్వారా తనకు లభించడం గర్వంగా ఉందన్నారు. మేధస్సు, సృజనాత్మకత, స్థిర సంకల్పం — ఈ మూడింటినీ సమతుల్యం చేసే మహిళగా తన ప్రయాణం సాగుతోందన్నారు సంజనా.
వీటి సాధన ద్వారా యువతులు ఎలాంటి పరిమితులు లేకుండా తమకు నచ్చిన రంగాల్లో ముందుకు వెళ్లాలని, తమ స్వంత మార్గాన్ని తామే నిర్మించుకోవాలని ఈసందర్భంగా సంజనా ఆకాంక్షించారు.

