మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను” చిత్రాలతో వరసగా నాలుగు విజయాలు సాధించాక… ఆచార్య అనే ఒకే ఒక్క ప్లాప్ తో కొరటాల శివ కెరీర్ ఆగమాగం అయిపోయింది. ఎంతగా అంటే… దేవర చిత్రం కమర్షియల్ గా హిట్టయినా సరే… అతని కెరీర్ గాడిన పడలేదు దేవర-2 ఉంటాదని చెబుతున్నా… ఎప్పుడు ఉంటాదనే దానిపై స్పష్టత లేదు. అయిదు బ్లాక్ బస్టర్స్, ఒకే ఒక్క ప్లాప్ ఇచ్చిన దర్శకుడి పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉండడం ఏమిటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు!!
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో… కొరటాలకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్త సంచలనం సృష్టించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు… బాలకృష్ణ – కొరటాల శివ కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. మాంచి కసి మీదున్న కొరటాలకు బాలయ్య దొరికితే… సినిమా ఎలా ఉంటుందన్నది ఊహించడం సైతం కష్టమే అంటే… అది కచ్చితంగా అతిశయోక్తి కాదు!!

