Sunday, February 22, 2026
HomeEntertainmentఅట్టహాసంగా ఆరంభమైన అమ్మా………నాకు ఆ అబ్బాయి కావాలి!!

అట్టహాసంగా ఆరంభమైన అమ్మా………నాకు ఆ అబ్బాయి కావాలి!!

- Advertisment -

అట్టహాసంగా ఆరంభమైన అమ్మా………నాకు ఆ అబ్బాయి కావాలి!!

ప్రముఖ మహిళా వ్యాపారవేత్త
జి. శైలజా రెడ్డి నిర్మాతగా
శివాల ప్రభాకర్ దర్శకత్వంలో!!

తెలుగు చిత్రసీమలోకి మరో మహిళా నిర్మాత అరంగేట్రం చేస్తున్నారు. ఆమె పేరు “జి. శైలజా రెడ్డి”. సీనియర్ దర్శకుడు శివాల ప్రభాకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పేరు “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”. జి.ఎస్.ఆర్. మూవీ మేకర్స్ పతాకంపై భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంతో యువ కిశోరం పవన్ మహావీర్ హీరోగా పరిచయమవుతున్నాడు. సుహాన – మేఘశ్రీ హీరోయిన్లు. సీనియర్ నటులు సుమన్, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీలక్ష్మి శైలజ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు!!

ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో అత్యంత ఘనంగా జరిగింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రచనా బాహుబలి వి.విజయేంద్రప్రసాద్ క్లాప్ కొట్టగా… నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ ఐ.పి.ఎస్. అధికారి ఘట్టమనేని శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, శోభారాణి, ప్రముఖ రచయిత జె.కె.భారవి తదితరులు ఈ వేడుకలో పాల్గొని నిర్మాతలను అభినందించారు. ఎల్.ఎన్.ఆర్. – జి.సాయిపద్మారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, ప్రొడక్షన్ మేనేజర్: బాలరాజు, కో-డైరెక్టర్: రావుశ్రీ, సమర్పణ: శ్రీలక్షీ శైలజ, నిర్మాత: జి.శైలజారెడ్డి, కథ – మాటలు – స్క్రీన్ ప్లే – ,దర్శకత్వం: శివాల ప్రభాకర్!!

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments