Sunday, February 22, 2026
HomeEntertainmentబిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలో పాన్ ఇండియా వైడ్‌గా రూపొందుతున్న ‘కర్మస్థలం’ నుంచి కొత్త...

బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రలో పాన్ ఇండియా వైడ్‌గా రూపొందుతున్న ‘కర్మస్థలం’ నుంచి కొత్త పోస్టర్ విడుదల

- Advertisment -

సామ్రాద్ని ఫిల్మ్స్ , రాయ్ ఫిల్మ్స్ బ్యానర్ల మీద హర్ష వర్దన్ షిండే నిర్మాతగా బిగ్ బాస్ దివి ముఖ్య పాత్రలో రాకీ షెర్మాన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. పాన్ ఇండియా వైడ్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసి అందరిలోనూ అంచనాల్ని పెంచేశారు. దివిని ఓ యోధురాలిగా చూపిస్తూ వదిలిన ఈ కొత్త పోస్టర్ ట్రేడ్ సర్కిళ్లలో హైప్ పెంచేసింది.

‘కర్మస్థలం’ అంటూ వదిలిన పోస్టర్‌లో దివి కదనరంగంలో దూసుకుపోతోన్నట్టుగా కనిపించడం, చుట్టూ అగ్ని జ్వాలలు, బ్యాక్ గ్రౌండ్‌లో యుద్ధం చేస్తున్న సైనికులు ఇలా ప్రతీ ఒక్క డీటైల్‌ను పోస్టర్‌లో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్లు చెబుతున్నారు.

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రానున్న ఈ చిత్రంలో అర్చనా శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

ఈ మూవీకి శిరీష్ ప్రసాద్ ఎడిటర్‌గా, సాయి కార్తీక్ సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు.

తారాగణం : అర్చన శాస్త్రి, చుంకీ పాండే, అరవింద్ కృష్ణ, ప్రిన్స్ సెసిల్, దివి వద్త్యా, కిల్లి క్రాంతి, మిథాలి చౌహాన్, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్ అల్వా, బలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్ తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్ : సామ్రాద్ని ఫిల్మ్స్ , రాయ్ ఫిల్మ్స్
నిర్మాత : హర్ష వర్దన్ షిండే
దర్శకుడు : రాకీ షెర్మాన్
సంగీతం : సాయి కార్తీక్
ఎడిటర్ : శిరీష్ ప్రసాద్
పీఆర్వో : సాయి సతీష్

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments