పాతికేళ్ల నుంచి ముప్పై ఏళ్ల వయసున్న ఓ ఆడియెన్ నా సినిమాకు వచ్చాడనుకుంటే, తను అన్నేళ్లు పెరిగిన వాతావరణం, ఎదుర్కొన్న అనుభవాలను నా రెండు గంటల సినిమా చూసి మారిపోతాడనుకుంటే నేను నమ్మను. తన పాతికేళ్ల అనుభవాన్ని నా రెండు గంటల సినిమాతో పోల్చలేను. అయితే ఈ సినిమాను కూడా నీ ఎక్స్‌పీరియెన్స్‌లో చేర్చుకోమని చెప్పటమే నా ఆలోచన. అమెరికాలో ఉన్న వాడికి ఊర్లల్లో ఇదీ జరుగుతుందని తెలుసుకునే అవకాశం లేదు. అలాగే హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినోడికి ఊర్లలో ఫంక్షన్స్ ఎలా జరుగుతాయనేది తెలుసుకునే అవకాశం ఉండదు. ఈ లైఫ్ స్టైల్‌ను వాళ్ల ఎక్స్‌పీరియెన్స్‌లో ఫేస్ చేయకపోవచ్చు. ఈ సినిమాను థియేటర్‌లోకి వచ్చి చూసినప్పుడు ‘ఓహో ఊరు ఇలా ఉంటుందా? ’ అనే చిన్న ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తున్నాం. దాన్ని నిజ జీవితంలో ఉపయోగిస్తావా! లేక 0.1 శాతం అయినా మారావా లేక ఆ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇంకొకడి షేర్ చేస్తావా? అనేది ఆడియెన్‌కే వదిలేస్తున్నాం. మేం ఏది ఇక్కడ బలవంతం చేయటం లేదు.
#Dhandoraa movie Director #MuraliKanth

