Friday, December 5, 2025
HomeEntertainmentడాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజన్ సినిమా హౌస్

డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజన్ సినిమా హౌస్

- Advertisment -

నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న‌ నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా. అరుళ‌నందు, మాథ్యో అరుళ‌నందు ఆధ్వర్యంలో ఈ నిర్మాణ సంస్థ తమ మూడో చిత్రంగా ‘హైకు’ని ప్రకటించింది. నిర్మాత‌ల్లో ఒక‌రైన డాక్ట‌ర్ అరుళ‌నందు పుట్టిన‌రోజు (డిసెంబ‌ర్ 5) సంద‌ర్భంగా హైకు ఫస్ట్ లుక్ణు మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళ మరియు మళయాళం భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది.

‘హైకూ’ చిత్రంలో ఏగన్ హీరోగా న‌టిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు కోర్ట్‌: కోర్ట్ వ‌ర్సెస్ ఏ నోబ‌డి ద్వారా గుర్తింపు పొందిన శ్రీదేవి అపల్ల, మిన్న‌ల్ ముర‌ళి చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ఫెమినా జార్జ్ ప్ర‌ధాన పాత్ర‌లను పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను గ‌మిస్తే.. ఇదొక రొమాంటిక్ డ్రామా అని తెలుస్తుంది. యువ‌తీ యువ‌కుల్లోని అమాయ‌క‌త్వంతో కూడిన ప్రేమ‌, విద్యార్థి జీవితంలో ఆశ‌లు, వారు క‌నే క‌ల‌ల నేప‌థ్యంతో ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా రానుంది. రంగురంగుల కుర్చీలతో ఖాళీగా ఉన్న గ్యాలరీలో కూర్చున్న హీరో హీరోయిన్ మ‌న‌కు క‌నిపిస్తున్నారు. వారి మధ్య చ‌క్క‌టి కెమిస్ట్రీ మ‌న‌కు పోస్టర్‌లో అందంగా క‌నిపిస్తోంది. ఆకాశంలో క‌నిపించే ల‌వ్ సింబ‌ల్ టైటిల్‌ను సూచించే సున్నిత‌మైన భావాన్ని తెలియ‌జేస్తోంది. అలాగే హీరో హీరోయిన్ వెనుక‌గా క‌నిపిస్తోన్న ఫాలింగ్ సూన్ అనే లైన్ వారి ఎమోష‌న‌ల్ జ‌ర్నీని సూచిస్తోంది.

యువ‌రాజ్ చిన్న‌సామి ఈ సినిమాకు రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆయ‌న యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా యూనిక్ స్టోరీ నెరేష‌న్‌తో ఓ ప్ర‌త్యేక‌త‌ను తీసుకొచ్చారు. హ‌రిహ‌ర‌న్‌తో క‌లిసి స్క్రీన్ ప్లే రాశారు. అదిర్చి అరుణ్ తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. బేబి, కోర్ట్ చిత్రాల‌కు సంగీతాన్ని అందించిన విజ‌య్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీతాన్ని సార‌థ్యం వ‌హిస్తున్నారు. హృద‌యాన్ని హ‌త్తుకునేలా, ఎమోష‌న‌ల్ కంటెంట్ క‌నెక్ట్ అయ్యే సంగీతాన్ని అందిస్తున్నారు.

జో, కోళి ప‌న్నై చెల్ల దురై చిత్రాల అందించిన విజ‌న్ సినిమా హౌస్ త‌న బ్యాన‌ర్‌లో రూపొందిస్తోన్న మూడో చిత్ర‌మిది. యంగ్ టాలెంట్‌ను, ఆలోచ‌న‌ల‌ను ఎంక‌రేజ్ చేస్తూ మ‌రోసారి ఈ నిర్మాణ సంస్థ వైవిధ్య‌మైన సినిమాతో మ‌న ముందుకు రానుంది. ప్రేమ‌లోని ప‌విత్ర‌త‌, అంద‌మైన స్నేహం, మ‌నల్ని మ‌నం క‌నుగొనే ప్ర‌యాణం వంటి హృద‌యాన్ని హ‌త్తుకునే ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందిస్తున్నాఉ.

విజ‌న్ సినిమా హౌస్ బ్యాన‌ర్‌పై యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తూ, స‌రికొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో సినిమాల‌ను రూపొందిస్తోన్న డాక్ట‌ర్ అరుళ‌నందుకి చిత్ర యూనిట్ ఫ‌స్ట్ లుక్‌ను రివీల్ చేయ‌టం ద్వారా హృద‌య పూర్వ‌క అభినంద‌న‌లు తెలియ‌జేసింది.

త్వ‌ర‌లోనే సినిమాలోని న‌టీన‌టుల‌కు సంబంధించిన గ్లింప్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ స‌హా ఇత‌ర వివ‌రాల‌ను రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు. హైకు చిత్రానికి ఏగ‌న్ అరుళ‌నందు ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌.. శ్రీనివాస్ నిరంజ‌న్ స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

న‌టీన‌టులు: ఏగ‌న్‌, శ్రీదేవి అపల్ల‌, ఫెమినా జార్జి, అదిర్చి అరుణ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం: బ్యాన‌ర్ : విజ‌న్ సినిమా హౌస్‌, సంగీతం : విజ‌య్ బుల్గానిన్‌, స్క్రీన్ ప్లే : హ‌రిహ‌ర‌న్ రామ్‌, యువ‌రాజ్ చిన్నసామి, సినిమాటోగ్ర‌ఫీ: ప్రియేష్ గురుసామి, ఎడిట‌ర్‌: శ‌క్తి ప్రాణేష్‌, ఆర్ట్: వ‌ఇజు విజ‌య‌న్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: దినేష్ మోహ‌న‌న్‌, కొరియోగ్రాఫ‌ర్‌: అనుషా విశ్వ‌నాథ‌న్‌, స్టిల్స్‌: ఆర్‌.ఎస్‌.రాజా, ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: ది స‌ర్క్యిట్‌, టైటిల్ డిజైన్‌: వీర‌, పి.ఆర్‌.ఒ: సురేష్ చంద్ర (త‌మిళ్‌), ఎస్ కె నాయుడు – ఫ‌ణి కందుకూరి (తెలుగు), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : ఏగ‌న్ అరుళ్‌నందు, కో ప్రొడ్యూస‌ర్‌: శ్రీనివాస్ నిరంజ‌న్‌, నిర్మాత‌లు: డా.అరుళ‌నందు , మాథ్యో అరుళ‌నందు , ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: యువ‌రాజ్ చిన్న‌సామి

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments