జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కోసం IMAX బుకింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమైన వెంటనే ప్రేక్షకుల్లో హై లెవల్ రెస్పాన్స్ కనిపిస్తోంది. డిసెంబర్ 19న విడుదలకు ముందు నుంచే ఈ హాలీవుడ్ బిగ్గీపై భారీ బజ్ క్రియేట్ అయింది.
IMAX స్క్రీన్లను నిర్వహిస్తున్న PVR INOX, ఈసారి ముందుగానే యాక్షన్‌లోకి దిగి ముఖ్యమైన థియేటర్లలో ప్రత్యేక బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. యాప్, వెబ్‌సైట్, థియేటర్ కౌంటర్ వంటి మూడు ఆప్షన్ల ద్వారా టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. ప్రచారం కూడా శరవేగంగా కొనసాగుతోంది.

అవతార్ సిరీస్‌లో మూడో భాగంగా వస్తున్న ‘ఫైర్ అండ్ యాష్’, పండోరా ప్రపంచానికే మరో కొత్త షేడ్ ఇవ్వబోతోంది. ఫైర్ క్లాన్ నాయకుడు వరంగ్ పాత్ర కథకు ముఖ్య దిశన ఇవ్వబోతుందని తెలుస్తోంది.
కొత్త క్లాన్లు, కొత్త కల్చర్స్, ఎమోషనల్ డెప్త్ ఇవన్నీ కలిసి విజువల్‌గా కూడా పెద్ద ఎత్తున ఆకట్టుకునే ఛాన్సులు ఉన్నాయి.
డిసెంబర్ 19న సినిమా ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో భారీగా విడుదల కానుంది. IMAX షోలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ముందుగానే టికెట్లు సెక్యూర్ చేసుకోవాలని థియేటర్లు సూచిస్తున్నాయి.

