Friday, December 5, 2025
HomeEntertainmentఈ నెల 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న స్టార్ హీరో...

ఈ నెల 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న స్టార్ హీరో కార్తి, స్టూడియో గ్రీన్ కాంబో క్రేజీ మూవీ “అన్నగారు వస్తారు”. ఈ రోజు మూవీ నుంచి ‘అన్నగారు’ లిరికల్ సాంగ్ రిలీజ్

- Advertisment -

స్టార్ హీరో కార్తి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ “వా వాతియార్” తెలుగు ప్రేక్షకుల ముందుకు “అన్నగారు వస్తారు” టైటిల్ తో రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. “అన్నగారు వస్తారు” సినిమాను ఈ నెల 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్ లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. యాక్షన్ కామెడీ కథతో దర్శకుడు నలన్ కుమారస్వామి రూపొందిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ రోజు “అన్నగారు వస్తారు” రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ తో పాటు ఈ చిత్రం నుంచి ‘అన్నగారు’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను సంతోష్ నారాయణన్ ఛాట్ బస్టర్ ట్యూన్ తో కంపోజ్ చేయగా, రాకేందు మౌళి క్యాచీ లిరిక్స్ అందించారు. ఎస్.పి.అభిషేక్, హరిప్రియ ఎనర్జిటిక్ గా పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘అన్నగారు, అన్నగారు..ఆల్రెడీ నే రిచ్ కిడ్డు, పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేశా, రాజమౌళికి ఫోన్ చేసి నా మీద బయోపిక్ ఒకటి తీయమంటున్న..’ అంటూ కలర్ ఫుల్ మేకింగ్ తో ఆకట్టుకుంటోందీ పాట. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేసిన “అన్నగారు వస్తారు” సినిమా టీజర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రమోషనల్ కంటెంట్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా హీరో కార్తి కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందనే ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

నటీనటులు – కార్తి, కృతి శెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – జార్జ్ సి. విలియమ్స్
ఎడిటింగ్ – వెట్రే కృష్ణన్
మ్యూజిక్ – సంతోష్ నారాయణన్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
బ్యానర్ – స్టూడియో గ్రీన్
నిర్మాత – కె. ఇ. జ్ఞానవేల్ రాజా
రచన, దర్శకత్వం – నలన్ కుమారస్వామి

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments