Friday, December 5, 2025
HomeEntertainmentరైటర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ కొత్త కార్యవర్గం కొలువుదీరింది!!

రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ కొత్త కార్యవర్గం కొలువుదీరింది!!

- Advertisment -

రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ కొత్త కార్యవర్గం కొలువుదీరింది!!

రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ సర్వసభ్య సమావేశం 30-11- 25 న ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగింది. డాక్టర్ ఎం. వినోద్ బాల ప్రధాన ఎన్నికల అధికారిగా, ఎన్నికల కమిటీ నూతన కార్యవర్గానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి… 27- 11 – 25న నామినేషన్ల ఉపసంహరణ తరువాత అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిచినట్లు ప్రకటించారు. ఎన్నికైన నూతన కమిటీ…. బుర్రా సాయి మాధవ్, అంజన్ మేగోటి సమక్షంలో సర్వసభ్య సమావేశంలో ప్రమాణస్వీకారం చేసింది. ఫిలిం ఛాంబర్ లో పెద్ద సంఖ్యలో హాజరైన సభ్యుల సమక్షంలో పలు అంశాలపై చర్చించారు. సంస్థ అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలపై ప్రధాన కార్యదర్శి నివేదికను జి. శ్రీ శశాంక సభ్యులకు వెల్లడించారు. అతిథులు శివ నాగేశ్వరరావు, కాదంబరి కిరణ్ కుమార్… ఏకగ్రీవంగా ఎన్నికైన సర్వశ్రీ కొమ్మనాపల్లి గణపతి రావు (అధ్యక్షులు), జి. శ్రీ శశాంక (ప్రధాన కార్యదర్శి), వై నరేంద్ర కుమార్ (కోశాధికారి), గోవర్ధన్ రెడ్డి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్)’ బి.వి.రామారావు- (వైస్ ప్రెసిడెంట్), ఎం. ఫణి కుమార్- (జాయింట్ సెక్రెటరీ), ఇతర ఈసీ మెంబర్స్ ని అభినందించారు. అనంతరం ఇటీవల స్వర్గస్తులైన ప్రముఖ కవి – రచయిత “అందెశ్రీ”కి సభ రెండు నిమిషాల మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించింది!!

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments