దగ్గరుండి రిసెప్షన్ వేడుక జరిపించిన మాగంటి మురళి మోహన్ కుటుంబం .
మెగాస్టార్ చిరంజీవి మొదలు నేటి తరం అగ్రహీరోల వరకు దాదాపు అందరి హీరోల చిత్రాలకు స్టిల్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతునిగా మంచితనానికి మారుపేరుగా అందరు పిలుచుకునే స్టిల్స్ జి.నారాయణరావు కుమారుడు సత్య (బాబీ) వివాహం కోయంబత్తూర్ కి చెందిన కుమారి క్రిష్ తో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో హై-టెక్ సిటీ లోని జయభేరి క్లబ్ లో నిర్వహించిన రిసెప్షన్ కి పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. సీనియర్ నటులు మురళి మోహన్, వారి సోదరులు కిశోర్ , కుమారుడు మాగంటి రామ్మోహన్ దగ్గరుండి ఈ వేడుక జరిపించడం విచ్చేసిన అతిధులకు సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఒక టెక్నీషియన్ కి మాగంటి కుటుంభం ఇచ్చిన గౌరవం అమోఘం అని సినీ వర్గాలు చర్చించుకున్నాయి.సినీ నిర్మాతలు సి.కళ్యాణ్ ,దిల్ లక్ష్మణ్ ,కే వీ వీ సత్యనారాయణ,డీ వీ కే రాజు,రాశీ మూవీస్ నరసింహ రావు,శివలంక కృష్ణ మోహన్, మల్లిడి సత్యనారాయణ,విజయ్ వర్మ పాకలపాటి ,సురేష్ కొండేటి, ఖంటమనేని శివ శంకర్,రావుల వెంకటేశ్వర రావు,గిరిధర్,దర్శకులు రేలంగి నరసింహ రావు,నీలకంఠ , చంద్ర మోహన్,ఘంటా శ్రీనివాస్,లెజెండరీ డైరెక్టర్ కే.విశ్వనాధ్ గారి కుమారులు నాగిన్ , రవి కుమార్,అల్లుడు ప్రమోద్,నటులు రావు రమేష్ , సినిమాటోగ్రాఫర్స్ చోట కే నాయుడు ,ఎమ్ వీ రఘు ,పీ ఆర్ కే రాజు, కే రవీంద్ర బాబు,వాసు , జవహర్ రెడ్డి,సినిమాటోగ్రఫీ మరియుస్టిల్ ఫోటో గ్రాఫర్ యూనియన్ కమిటీ సభ్యులు,జర్మనీనుండి విచ్చేసిన పెళ్లికుమారిని స్నేహితులు మరియు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు సాంకేతిక నిపుణులు ఈ రిసెప్షన్ కి విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.

