తెలుగు చిత్రసీమలో ప్రముఖ నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ 70వ జన్మదిన వేడుకల వైభవంగా జరిగింది.
నాటక రంగ కళాకారుడిగా ప్రస్థానం ప్రారంభించిన రామసత్యనారాయణ 2004లో ‘ఎస్. పి. సింహ ఐ. పి. ఎస్.’ చిత్రంతో నిర్మాతగా మారి చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ‘భీమవరం టాకీస్’ పతాకంపై ఇప్పటివరకు 115 చిత్రాలను నిర్మించిన తుమ్మలపల్లి… శతాధిక చిత్రా నిర్మాతగా రికార్డు సృష్టించారు.
ఈ వేడుకల్లో నటుడు వినోద్ కుమార్ నువ్వుల, కొరియోగ్రాఫర్ సత్య మాస్టర్, దర్శక నటుడు తల్లాడ సాయికృష్ణ, దర్శకుడు ప్రణయ్ రాజ్ వంగరి, దర్శకుడు విజయ్ యర్రంశెట్టి, దర్శకుడు దేవ్, డిఓపీ నాని, నటుడు రాందేవ్ భీంపాగా తదితరులు పాల్గొన్నారు!!

