మల్లేశం, 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుంచి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ “23” తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. సినిమా మే 16న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హీరో ప్రియదర్శి, ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ చీఫ్ గెస్ట్ లు గా హాజరై… సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు!!
