జెసి ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం శివోహం. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రంలో ఇ. వి. ప్రసాద్, శిరీష, శ్రీలత, రాణి, జి వి వి. సిద్దు, బి శివశంకర్, మునేష్, స్వాతి, మురళీధర్, పుల్లయ్య, మనీషా, గ్లామర్ బాయ్ విశ్వనాధ్ రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.
మహాశివరాత్రి సందర్భంగా విలన్ లుక్ పోస్టర్ని లాంచ్ చేసింది చిత్ర బృందం. అతి త్వరలో తెలుగు హిందీ భాషల్లో ఈ చిత్రం థియేటర్లో సందడి చేయనుంది. సతీష్ పిల్లి ఛాయాగ్రహణం సమకూర్చిన ఈ చిత్రానికి స్టోరీ – స్క్రీన్ ప్లే – నిర్మాణం – దర్శకత్వం: విజయ్ యర్రంశెట్టి!!

