Tuesday, July 1, 2025

Top 5 This Week

Related Posts

వీడే మన దాసరి వారసుడు




నేటి సమాజానికి ఎంతో అవసరమైన మెసేజ్ అందిస్తూ రమేష్ ఉప్పు (RSU) హీరోగా, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వీడే మన వారసుడు’. రమేష్ ఉప్పు (RSU) కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, పాటలు, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొని చిత్ర యూనిట్ కు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మల్టీటాలెంట్ చూపిస్తున్న రమేష్ ఉప్పును దర్శకరత్న దాసరితో పోల్చారు పాల్గొన్న అతిథులు. సమ్మెట‌ గాంధీ, దేవసేన (వెంకటగిరి), విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 18న తెలుగు రాష్ట్రాల‌లో విడుద‌ల చేయ‌బోతున్నట్టు చిత్ర దర్శకనిర్మాత రమేష్ ఉప్పు తెలిపారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles