“ఖైదీ నెంబర్ 150” తర్వాత వినాయక్ నుంచి వచ్చిన “ఇంటిలిజెంట్” బాగా డిజప్పాయింట్ చేసింది. ఆ తర్వాత రాజమౌళి “ఛత్రపతి”ని అదే పేరుతో బెల్లంకొండ శ్రీనివాస్ తో రీమేక్ చేశాడు. అది మరింత నిరాశపరిచింది. ఈ రెండిటి మధ్యలో హీరోగా ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం కూడా “అది”లొనే ఆగిపోయింది. వీటన్నింటికీ ఆరోగ్య కారణాలు తోడవ్వడంతో… విశ్రాంతి మోడ్ లో ఉండిపోయిన వినాయక్… ఇప్పుడు శారీరకంగా, మానసికంగా సంసిద్ధుడై త్వరలో దర్శకత్వపు కదనరంగంలోకి కాలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తోంది. యూట్యూబ్ ఛానల్స్ కు వరసగా ఇంటర్వ్యూలు ఇస్తుండడం, ప్రత్యేక శ్రద్ధతో “హోమ్ టూర్” ప్రోగ్రామ్ చేయించుకోవడం, సినిమా ఫంక్షన్స్ కి అతిధిగా హాజరవుతుండడం వంటి విషయాలను గమనించినప్పుడు… అతి త్వరలో వినాయక్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ చిత్రం అనౌన్స్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వినాయక్ కాల్ చేయాలే గానీ… ఎంత పెద్ద హీరో అయినా కాల్షీట్స్ టక్కున కేటాయించేస్తారు కాబట్టి… ఏ నిర్మాణ సంస్థను ఆయన ఎంపిక చేసుకుంటారో వేచి చూడాలి. అన్నట్లు వచ్చే ఏడాది దర్శకుడిగా వినాయక్ కి సిల్వర్ జూబ్లీ ఇయర్. వినాయక్ తొలి చిత్రం “ఆది” 2002లో మార్చి 28న విడుదలైంది. వినాయక్ దర్శకత్వంలో రూపొందే 18వ చిత్రం సిల్వర్ జూబ్లీ కానుకగా 2027లోనే వచ్చే అవకాశం ఉంది!! – అప్పాజీ

