సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి వినాద్రి, బేబీ నేహాశ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ఈనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్. బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్ గౌతంకృష్ణ హీరోగా రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తూ అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ, ఆర్కే మామ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. త్రిలోక్ సిద్దు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. జుడా సంధ్య ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. జూలై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరు కాగా… రఘు కుంచే, కేఎల్ దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్ తదితరులు హాజరై సోలో బాయ్ చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు!!