సూర్య సరసన సూపర్ బ్యూటీ
హీరో సూర్య మెగా-ఎంటర్‌టైనర్ ‘సూర్య 45’ ఇటివలే లాంచ్ అయ్యింది. ఆర్జే బాలాజీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్ గా ఎంపిక కావడం విశేషం. సూర్య – త్రిష కలయికలో ఇంతకుముందు మూడు చిత్రాలు రూపొందాయి. “ఆరు” చిత్రం అనంతరం వీరిద్దరూ ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం!!