కర్ణాటక ప్రభుత్వానికి చెందిన స్నానపు సబ్బు మైసూర్ శాండల్ ప్రచారకర్తగా తమన్నా భాటియా ఎంపికయ్యింది. మైసూర్ శాండల్ కు దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించేందుకు ఇకపై భాటియా నడుం కట్టనుంది. “జైలర్, స్త్రీ-2, రైడ్-2” చిత్రాల్లో తమన్నా చేసిన ఐటమ్ సాంగ్స్ ఆమె పాపులారిటీని మరింత పెంచాయి. ఆమె ఖాతాలో “బాహుబలి” లాంటి బ్లాక్ బస్టర్ ఉండనే ఉంది. సుమారు రెండు దశాబ్దాలుగా లైమ్ లైట్ లో ఉంటున్న తమన్నా ఇక నుంచి.. తన సౌందర్య రహస్యం “మైసూర్ శాండల్” అంటే వినడానికి కొంచెం ఎబ్బెట్టుగానే ఉన్నా తప్పదు మరి!!
