HomeEntertainmentన్యూయార్క్ ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ట్రైలర్...

న్యూయార్క్ ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ లాంచ్

- Advertisment -

ప్రపంచవ్యాప్తంగా అశేష ప్రేక్షకాదరణ పొందిన స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో సరికొత్త చిత్రం ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ట్రైలర్ విడుదలైంది. మొట్టమొదటి గ్లోబల్ ఫ్యాన్-డ్రివెన్ ట్రైలర్ టీజ్ తర్వాత, న్యూయార్క్ నగరంలో ఐకానిక్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై నుండి టామ్ హాలండ్ పూర్తి ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు ఇదొక మరపురాని క్షణంగా నిలిచిపోయింది.

‘స్పైడర్-మ్యాన్: నో వే హోమ్’ సాధించిన రికార్డ్-బ్రేకింగ్ గ్లోబల్ సక్సెస్ తర్వాత, పీటర్ పార్కర్, స్పైడర్ మ్యాన్‌ల జీవితాల్లో ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. ‘నో వే హోమ్’ సంఘటనలు జరిగి నాలుగు సంవత్సరాలు గడిచాయి. పీటర్ ఇప్పుడు తనను ప్రేమించేవారి జీవితాలు, జ్ఞాపకాల నుండి తన అస్తిత్వాన్ని పూర్తిగా చెరిపేసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. తన పేరును ఏమాత్రం గుర్తుపట్టలేని న్యూయార్క్ నగరంలో నేరాలతో పోరాడుతూ, సిటీని రక్షించడానికి ఒక ఫుల్-టైమ్ స్పైడర్ మ్యాన్‌గా పూర్తిగా అంకితమయ్యాడు. అయితే అతనిపై బాధ్యతలు, ఒత్తిడి పెరిగేకొద్దీ.. ఊహించని శారీరక మార్పులు అతని మనుగడకే ముప్పుగా పరిణమిస్తాయి. అదే సమయంలో నగరంలో జరుగుతున్న వింతైన నేరాల పరంపర అతనెన్నడూ ఎదుర్కోనంతటి అత్యంత శక్తివంతమైన విలన్ ముప్పుకు దారితీస్తుంది.

సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండియా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్, జూలై 31న ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అన్ని ప్రీమియం ఫార్మాట్లలో థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisment -
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments