మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్న సినిమా హీరోగా రామ్ 22వది. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ లుక్ విడుదల చేశారు. ‘మీకు సుపరిచితుడు… మీలో ఒకడు… మీ సాగర్’ అంటూ రామ్ పాత్రను పరిచయం చేశారు. రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: మధు నీలకందన్, మ్యూజిక్: వివేక్ – మెర్విన్, సీఈవో: చెర్రీ, ప్రొడక్షన్ హౌస్: మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, కథ – కథనం – దర్శకత్వం: మహేష్ బాబు పి.!!