న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హంగామా స్టార్ట్ అవుతుంది ఈ 2026 న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని తీరం
గుంటూరు హైల్యాండ్ లో డిసెంబర్ 31న రాత్రి 7గం,, గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పెషల్ న్యూ ఇయర్ అమిగోస్ వారు నిర్వహిస్తున్న ది గ్రాండ్ కౌంట్ డౌన్ బై అమిగోస్ మ్యూజికల్ కాన్సర్ట్‌ను ఈవెంట్‌ను నిర్వహించనున్నారు ఈ సందర్బంగా
ఈవెంట్ లోగోని పంజాగుట్ట సెంట్రల్ కొలంబస్ కాఫీ షాప్ లో ఆస్కార్ వినింగ్ సాంగ్ నాటు నాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విడుదల చేశారు.
ఈ సందర్బంగా రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ.. న్యూ ఇయర్ కౌంట్ డౌన్‌కు మా ఈవెంట్ నాకు పర్‌ఫెక్ట్ ప్లేస్ అవుతుంది. ఈ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ అమరావతి తీరం గుంటూరు హైల్యాండ్‌లో డిసెంబర్ 31 రాత్రి 7గం,, గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నాం. ది గ్రాండ్ కౌంట్ డౌన్ బై అమిగోస్ మ్యూజికల్ కాన్సర్ట్‌లో దాదాపు రెండున్నర, మూడు గంటల వరకు నేను సింగిల్‌గా పర్ఫామ్ చేస్తాను. నా పెళ్లైన తరువాత ఇది నా ఫస్ట్ ఈవెంట్ ఈ న్యూ ఇయర్ ఈవెంట్ నాకు ప్రత్యేకం మీరు కూడా ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఎంజాయ్ చెయ్యడానికి రావొచ్చు మేము మీ అందరినీ ఎంటర్టైన్ చెయ్యడానికి మీ గుంటూరు హైలాండ్ కీ వస్తున్నాం అని అన్నారు.
- అమిగోస్ ఈవెంట్ నిర్వాహకులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ* .. ‘రాహుల్ సిప్లిగంజ్ తన పెళ్లి తరువాత చేస్తున్న మొదటి ఈవెంట్ ఇదే అవుతుంది. సామాన్యులు కూడా వచ్చి చూసి ఎంజాయ్ చేసేలా మా ఈవెంట్ ఉంటుంది. సరసమైన ధరలకే టికెట్లను అందిస్తాం. దాదాపు ఐదారు వేల మంది వస్తారని మేం ఆశిస్తున్నాం. రెండున్నర గంటలు రాహుల్ అందరినీ ఎంటర్టైన్ చేస్తారు’ అని అన్నారు.
ఈ లోగో లాంచ్ కార్యక్రమనికి
ప్రసన్న కుమార్, వెలగ సునీల్ కుమార్, వుయ్యురు కృష్ణ ప్రసాద్, ప్రియాంక దాసరి కడలి రాంబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

