అయిదు పదులకు చేరువలో ఉంటేనేమి… నంబర్ వన్ హీరోయిన్ గా అలరారుతోంది ప్రియాంక చోప్రా. అంతర్జాతీయంగానూ ఆమెకు గల అసాధారణ గుర్తింపు ఇందుకు కారణం. మహేష్ బాబు – రాజమౌళి చిత్రంతోపాటు ఆమె నటిస్తున్న మరో చిత్రం “క్రిష్-4”. ఈ రెండు చిత్రాలకు ఆమె 30 కోట్లు చొప్పున పారితోషికం పుచ్చుకుంటోందని సమాచారం. “క్రిష్-4″తో హృతిక్ రోషన్ దర్శకుడిగా మారుతున్నారు. హీరో కూడా ఆయనే!!