సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య పాత్రలో రాబోతోన్న చిత్రం ‘ప్రణయ గోదారి’. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 13న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి, హీరో సోహెల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ప్రణయగోదారి టీం అంతా కలిసి ఓ చిన్నారి గుండెకు సంబంధించిన ఆపరేషన్ కోసం ఆర్థిక విరాళాన్ని అందించింది. ఈ సందర్భంగా అతిధులు మాట్లాడుతూ “ప్రణయ గోదారి” ప్రభంజనం సృష్టించాలని ఆకాంక్షించారు!!
ప్రణయగోదారి ప్రభంజనం సృష్టించాలి
Date: