హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఫౌజి” చిత్రం షూటింగ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కాలుకి ఫ్రాక్చర్ అయ్యిందని తెలుస్తోంది. ఫ్రాక్చర్ తీవ్రత కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ… షూట్ ని ప్రభాస్ కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. “సీతారామం” అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, ఇమ్రాన్ హష్మి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇమాన్వి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు!!
