ఈ ఏడాది డబ్బింగ్ బ్లాక్’బస్టర్స్
జాబితాలో సగర్వంగా స్థానం!!
తమిళంలో క్రియేట్ చేసిన మ్యాజిక్
తెలుగులోనూ రీ-క్రియేట్ చేసి, ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన డబ్బింగ్ చిత్రాల్లో బ్లాక్ బస్టర్ జాబితాలో “పాపా” స్థానం సంపాదించుకోవడం పట్ల నిర్మాత నీరజ కోట సంతోషం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులు “పాపా” చిత్రానికి నీరాజనం పడుతున్న కారణంగానే “కుబేర, కన్నప్ప” చిత్రాల ప్రభంజనం సైతం తట్టుకుని “పాపా” చిత్రం మూడోవారంలోనూ రెండు రాష్ట్రాల థియేటర్లలో సందడి చేస్తోందని ఆమె పేర్కొన్నారు!!
జూన్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన “పాపా” చిత్రాన్ని జె.కె.ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెలుగులో అనువదించారు నీరజ. కవిన్-అపర్ణాదాస్ జంటగా భాగ్యరాజా, విటివి గణేష్ కీలక పాత్రల్లో రూపొంది తమిళంలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ చిత్రానికి గణేష్.కె.బాబు దర్శకత్వం వహించారు. జెన్.మార్టిన్ సంగీతం, ఎలిల్ అరసు ఛాయాగ్రహణం… సరళమైన సాహిత్యంతో రవివర్మ రాసిన పాటలు, డబ్బింగ్ సినిమాలా కాకుండా… రీమేక్ సినిమా అనిపించేలా తీసుకున్న జాగ్రత్తలు, ముఖ్యంగా గణేష్ బాబు దర్శకత్వం “పాపా” విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, కవిన్ – అపర్ణాదాస్ మధ్య కెమిస్ట్రీ, కాన్ఫ్లిక్ట్ అందరినీ కట్టిపడేస్తోందని ఆమె పేర్కొన్నారు. ఈ సినిమా విజయం ఇస్తున్న ఉత్సాహంతో… త్వరలో ఒక స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేస్తున్నామని, త్వరలోనే వివరాలు ప్రకటిస్తామని నీరజ తెలిపారు!!
