తమిళ సూపర్ హిట్ మూవీ “డీఎన్ఏ”ను “మై బేబి” పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు నేడు తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి. దుప్పాడిగట్టు సారిక రెడ్డి, పి.సాయిచరణ్ తేజ కో ప్రొడ్యూసర్స్. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ – “మై బేబి” సినిమా తమిళ వెర్షన్ డీఎన్ఏ చూశాక ఈ సినిమాను ఎలాగైనా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనిపించింది. వాళ్లు చాలా ఎక్కువ రేట్ చెప్పారు. నేను గతంలో చేసిన సినిమాల గురించి వాటి సక్సెస్ గురించి చెప్పాను. అప్పుడు నా మీద నమ్మకంతో వాళ్లు ఈ సినిమా రైట్స్ మా సంస్థకు ఇచ్చారు. ఈ చిత్రానికి నాతో పాటు యష్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి సాయిచరణ్ గారు తోడయ్యారు. ప్రీమియర్ షో చూసి మురళీ మోహన్ లాంటి సీనియర్ నటులు కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది అర్థమైంది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి క్రేజీగా బిజినెస్ జరిగింది. నేను ప్రొడ్యూస్ చేసిన చిత్రాల్లో అన్నింటికన్నా ఎక్కువ థియేటర్స్ లో “మై బేబి” నేడు రిలీజ్ కాబోతోంది” అన్నారు!!
