HomeEntertainmentమెగాస్టార్ని కలిసిన తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నూతన కార్యవర్గం

మెగాస్టార్ని కలిసిన తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం నూతన కార్యవర్గం

- Advertisment -


మొన్న ఆదివార జరిగిన ఎన్నికలలో భారీ మెజార్టీ తో గెలిచిన దర్శకుల సంఘం అధ్యక్షుడు వీ.ఎన్.ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పీ.వీ.రామారావు, కోశాధికారి నీలం సాయి రాజేష్, ఉపాధ్యక్షులు వీ.సముద్ర, భాస్కరరెడ్డి, ప్రభు, జాయింట్ సెక్రటరీస్ డా.కృష్ణ మోహన్, చెరుకూరి బాలాజీ, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ రాజా వన్నెంరెడ్డి, సునీల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొలను, సాగర్ కే చంద్ర, విజయ్ కుమార్ కొండా, మల్లిక తలాటం, ఆకాష్, సాయి సురేంద్ర,
అంజిబాబు గుంటూరు, రమణ మొగిలి మర్యాద పూర్వకంగా వెళ్లి మెగాస్టార్ చిరంజీవి ని వారి నివాసంలో కలిశారు.


ఈ సందర్భంగా భారీ మెజార్టీ రావడానికి కారణమైన సాయి రాజేష్ ప్యానెల్ సభ్యులు గతంలో చేసిన కార్యక్రమాలు, వచ్చే రెండేళ్లలో చేయబోయే కార్యక్రమాల ప్రణాళికలు చిరంజీవి గారు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులకు పెన్నులు బహూకరించారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీ ఆర్ జాతీయ పురస్కారం చిరంజీవి గారిని వరించిన సందర్భంగా కమిటీ సభ్యులు మెగాస్టార్ ని సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచిన ప్రముఖ దర్శకుడు, దర్శకుల సంఘం ట్రస్ట్ కి కోశాధికారి మెహర్ రమేష్ గారిని కమిటీ సభ్యులు అభినందించారు.

- Advertisment -
RELATED ARTICLES

Most Popular

Recent Comments