అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రం షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ఈ చిత్రం విడుదలకు ఇంకా కేవలం ఆరు నెలల వ్యవధి మాత్రమే ఉంది. ఇటీవల కాలంలో పెద్ద సినిమాలకు కనీసం 100 రోజుల ముందు నుంచి ప్రమోషన్స్ పరంగా కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అక్టోబర్ నుంచి ప్రచార కార్యక్రమాలు స్పీడ్ పెంచుతారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ప్రమోషన్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టని “విశ్వంభర” చిత్రసం సంక్రాంతికి ముందే వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లుగానే కనబడుతున్నాయి. అందువల్ల… మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా “విశ్వంభర” అప్ డేట్ కాకుండా… అనిల్ రావిపూడి సినిమా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. “వాల్తేరు వీరయ్య” తరహాలో.. మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేష్ కలయికలో తెరకెక్కుతున్న రావిపూడి చిత్రానికి సరైన టైటిల్ ఖరారు చేసే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉందని సమాచారం!!
విశ్వంభర మళ్ళీ వెనక్కి?
