Tuesday, July 8, 2025

Top 5 This Week

Related Posts

మంచాల నాగరాజ్ దర్శకత్వంలో మాధవ్ ఇన్ అండ్ యాజ్ మారెమ్మ

మాస్ మహారాజా రవితేజ బ్రదర్ యాక్టర్ రఘు కుమారుడు యంగ్ చాప్ మాధవ్ రూరల్ రస్టిక్ మూవీ ‘మారెమ్మ’తో హీరోగా సినిమాల్లోకి అడుగుపెడుతున్నారు. ఈ హై-ఆక్టేన్ ప్రాజెక్ట్‌కి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు తమ ప్రొడక్షన్ నంబర్ 1గా నిర్మిస్తున్నారు. వినోద్ కుమార్, వికాస్ వశిష్ట, దయానంద్ రెడ్డి, వి.ఎస్.రూప లక్ష్మి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో మాధవ్ సరసన దీపా బాలు కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. దేవ్ రాథోడ్ ఎడిటర్, రాజ్‌కుమార్ మురుగేశన్ ఆర్ట్ డైరెక్టర్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles