సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న నటించిన చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న విడుదలైన చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా మేకర్స్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
కింగ్ నాగార్జున మాట్లాడుతూ.. “సినిమా అందరికీ నచ్చింది. శేఖర్ తో నాకు ఎప్పటి నుంచో సినిమా చేయాలని కోరిక. సుమంత్, చైతన్య, అమల.. వీళ్లంతా పనిచేయడానికి ముందు నుంచే శేఖర్ తో వర్క్ చేయాలని ఉండేడి. శేఖర్ కూడా ‘మీతో ఒక స్టైలిష్, ఫ్యామిలీ సినిమా చేయాలని వుందని’ చెప్తుండేవారు. ఫైనల్ గా మా కాంబినేషన్లో ‘కుబేర’ వచ్చింది” అన్నారు!!
