కనుక కరీనా కాల్షీట్స్ మహేష్ బాబు కోసమే
సౌత్ కి చెందిన ఓ పాన్ ఇండియా డైరెక్టర్ తో సినిమా చేయనున్నానని కొద్ది రోజుల క్రితం కరీనా ప్రకటించగానే… అది రాజమౌళి సినిమానా… లేక సందీప్ రెడ్డి వంగా సినిమానా అనే చర్చ జోరుగా సాగింది. అయితే… ప్రభాస్ తో సందీప్ రెడ్డి రూపొందించే “స్పిరిట్”లో తాను నటించడం లేదని కరీనా తాజాగా చేసిన ప్రకటనతో… ఆమె అంగీకరించిన చిత్రం మహేష్ బాబుతో రాజమౌళి తెరకెక్కించే చిత్రమని తేలిపోయింది. మరి… ఈ విషయంలోనూ కరీనా ఏదైనా ట్విస్ట్ ఇస్తుందేమో చూడాలి!!